అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం... నూతన రెవెన్యూ చట్టంతో మరోసారి దేశం దృష్టిని ఆకర్షించబోతోందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతా ర్యాలీలు జోరుగా సాగుతున్నాయి. రైతులు, తెరాస శ్రేణులు ఊరూరా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
రైతులు కేసీఆర్కు రుణపడి ఉంటారు: ఎమ్మెల్యే సండ్ర - రాష్ట్ర రైతాంగం కేసీఆర్కు రుణపడి ఉంటుంది: ఎమ్మెల్యే సండ్ర
రాష్ట్ర రైతాంగం ఎప్పటికీ సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో... నూతన చట్టానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ... ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో ట్రాక్టర్లతో కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు.

రైతులు కేసీఆర్కు రుణపడి ఉంటారు: ఎమ్మెల్యే సండ్ర
వేంసూరు మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు 350 ట్రాక్టర్లకు కేసీఆర్ చిత్రపటాలు కట్టి ప్రదర్శన చేపట్టారు. అనంతరం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక దశాబ్దాలుగా సమస్యల వలయంలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపించి రైతుల భూములకు భరోసా కల్పించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని సండ్ర కొనియాడారు. రాష్ట్ర రైతాంగం ఎప్పటికీ సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారని అన్నారు.
ఇదీ చూడండి:టీటా డిజిథాన్కు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ ప్రశంసలు