ఖమ్మం జిల్లా తల్లాడలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. తమ పేరిట ఉన్న రూపే కార్డులను తమకు తెలియకుండా మాయం చేసి నగదు కాజేశారని ఆరోపిస్తూ బాధిత రైతులు రెండో రోజు ఆందోళన చేశారు. సంఘం పరిధిలో 1600 మంది సభ్యులుండగా.. 1400 మందికి గతంలో ఉన్న సంఘం బాధ్యుల ద్వారా రూపే కార్డులు మంజూరు చేశారు.
మిగిలిన కార్డులు రైతులకు పంపిణీ చేయకుండా కొందరు వ్యక్తులు కాజేశారని, రూ.10లక్షల వరకు డ్రా చేసినట్లు ఆరోపించారు. వీటిపై ప్రస్తుతం ఉన్న సంఘం సభ్యులతోపాటు సీఈవోను రైతులు ప్రశ్నించారు. ఖమ్మం, వైరా, తల్లాడలోని ఏటీఎంల ద్వారా నగదు కాజేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.