ఖమ్మంలో సీపీఐ ఆధ్వర్యంలో రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. పాత సీపీఐ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన - ఖమ్మంలో సీపీఐ ఆందోళనలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఖమ్మంలో సీపీఐ ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. పాత సీపీఐ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన
కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. నిరసనకారులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని... రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.