తెలంగాణ

telangana

ETV Bharat / state

'సర్వే నిలిపేయండి' - రహదారి సర్వే

ఖమ్మంలో జాతీయ రహదారి సర్వే గందరగోళంగా మారింది. తమ భూముల్లో రాళ్లు పాతడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే ఆపాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు.

రహదారి సర్వే

By

Published : Mar 5, 2019, 6:26 PM IST

ఆందోళన చేస్తున్న రైతులు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం వద్ద గ్రీన్​ఫీల్డ్​ జాతీయ రహదారి సర్వేను స్థానిక రైతులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా తమ భూముల్లో సరిహద్దు రాళ్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అక్కడికి చేరుకున్న తహసీల్దార్​ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సర్వే నిలిపేయకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

సర్వే నిలుపుదల

రైతుల ఆందోళనతో తహసీల్దార్​ సర్వే నిలిపేశారు. అనంతరం పూర్తి వివరాలతో రైతులు వినతిపత్రాన్ని ఆయనకు అందించారు.

ఇవీ చూడండి :మా రిజర్వేషన్లు మాకు కావాలి

ABOUT THE AUTHOR

...view details