తెలంగాణ

telangana

ETV Bharat / state

'లాభసాటి పంటలు సాగు చేయాలి' - Profitable crops should be cultivated said by Agricultural Officers

లాభసాటి పంటలు సాగు చేసి రైతులు మంచి దిగుబడులు సాధించాలని ఖమ్మం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఝాన్సీ లక్ష్మీ కుమారి సూచించారు. కొనిజర్ల మండలం గద్దలగూడెంలో రైతులు సాగు చేస్తున్న అల్లం సాగును ఆమె పరిశీలించారు. ఏన్కూర్ మండలంలో విత్తనాలు, ఎరువుల దుకాణాలు తనిఖీ చేశారు.

Examination of Agricultural Officers in Khammam District
లాభసాటి పంటలు సాగు చేయాలి

By

Published : Jun 9, 2020, 4:00 PM IST

ఖమ్మం జిల్లా రైతులు వ్యవసాయ పద్ధతులు అనుసరించడంలో రాష్ట్రంలో గుర్తింపు సాధించారని జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఝాన్సీ లక్ష్మీ కుమారి అన్నారు. లాభసాటి పద్ధతులు అధ్యయనం చేసి అనుసరించడం మంచి ఆలోచన అన్నారు. ఈ పద్ధతిని ప్రతి రైతు పాటించాలని ఆమె సూచించారు. గతేడాది రఘునాథపాలెం మండలం రైతులు నేరుగా వరి సాగును క్షేత్ర స్థాయిలో పరిశీలించి మంచి దిగుబడులు సాధించినట్లు పేర్కొన్నారు.

ఆధునిక పద్ధతులు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నియంత్రిత సాగు పద్ధతులపై రైతులు ఎలాంటి అపోహలకు గురి కాకుండా సూచించిన మేరకు పంటలు సాగు చేయాలన్నారు. వానాకాలంలో మొక్కజొన్నకు బదులు కంది, పత్తి పంటలు సాగు చేసుకోవాలని తెలిపారు. గతేడాది జిల్లాలో 59 శాతం సాగు చేశారని ఈ ఏడాది 75 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details