తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్రిక్తతలకు దారితీసిన కారేపల్లి పెద్ద చెరువు సర్వే వివాదం.. - Karepalli Pond Survey Controversy

Farmers clash with officials in Khammam: ఖమ్మం జిల్లా కారేపల్లి పెద్ద చెరువు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. చెరువు శిఖం భూములో ఆక్రమణలు జరిగాయాన్న ఆరోపణలతో అధికారులు సర్వే చేశారు. ఖమ్మం ఏసీపీ బసవ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ అధికారులు హద్దులను పరిశీలించారు. వ్యక్తిగత పట్టా భూముల్లో సర్వే చేస్తున్నారని కొందరు రైతులు అభ్యంతరం తెలిపారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు.

Farmers clash with officials
Farmers clash with officials

By

Published : Oct 11, 2022, 3:52 PM IST

Farmers clash with officials in Khammam: ఖమ్మం జిల్లా కారేపల్లి పెద్ద చెరువు శిఖం భూమి ఆక్రమణలో ఉన్న వాస్తవాలు వెలికి తీయాలని స్థానిక మత్స్యకారులు చేపట్టిన దీక్ష 122వ రోజుకు చేరింది. పోలీసుల బందోబస్తు నడుమ చెరువు శిఖం భూములను సర్వే చేసేందుకు సిద్ధమైన అధికారులు.. భూములను పరిశీలించారు.

కొంతకాలంగా ఉద్రిక్తత ఉన్న ఈ సమస్యను.. ఖమ్మం ఎసీపీ బసవ రెడ్డి ఆధ్వర్యంలో రఘునాధపాలెం, కామేపల్లి, కారేపల్లి, నేలకొండపల్లి ఎస్సైలు పోలీసుల ఆధ్వర్యంలో నీటిపారుదల రెవెన్యూ అధికారులు సర్వే చేస్తూ.. చెరువు హద్దులను పరిశీలింశారు. కొందరు రైతులు పట్టాలున్న తమ భూముల్లో సర్వే చేసి రాళ్లు ఎలా పాతుతారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు వారిని వారించి అక్కడనుంచి పంపించడంతో గొడవ సద్దుమణిగింది.

ఉద్రిక్తతలకు దారితీసిన కారేపల్లి పెద్ద చెరువు సర్వే వివాదం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details