రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న నూతన రెవెన్యూ చట్టాన్ని హర్షిస్తూ ఖమ్మం జిల్లా తల్లాడలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో రైతులు ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. నారాయణపురం నుంచి తల్లాడ రింగ్ రోడ్డు కూడలి వరకు రైతులు బండ్లతో ప్రదర్శనగా వచ్చారు. రైతుల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
రెవెన్యూ చట్టాన్ని హర్షిస్తూ తల్లాడలో రైతుల ఎడ్లబండ్ల ప్రదర్శన
రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఖమ్మం జిల్లా తల్లాడలో రైతులు ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రెవెన్యూ చట్టాన్ని హర్షిస్తూ తల్లాడలో రైతుల ఎడ్లబండ్ల ప్రదర్శన
అనేక సంక్షేమ పథకాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖ మార్పుతో ప్రజల్లో మరింత ఆదరణ పొందారన్నారు. డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, తెరాస మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రెడ్డం వీర మోహన్ రెడ్డి, దుగ్గి దేవర వెంకట్ లాల్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.