కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ వ్యతిరేక బిల్లులకు నిరసనగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో బైకు, ట్రాక్టర్ ర్యాలీను నిర్వహించారు. కార్యక్రమంలో భారీ ఎత్తున రైతులు ద్విచక్రవానాలు, ట్రాక్టర్లతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ధర్నా నిర్వహించారు.
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు బైకు, ట్రాక్టర్ ర్యాలీ - nelakondapalli farmerstractor rally
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో ద్విచక్రవాహన, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ వ్యతిరేక బిల్లులకు నిరసనగా ర్యాలీ చేపట్టారు.
![వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు బైకు, ట్రాక్టర్ ర్యాలీ Farmers bike, tractor rally against farm bill at nelkakondapalli in khammam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9366763-1086-9366763-1604052331131.jpg)
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు బైకు, ట్రాక్టర్ ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తోందని ఆయన దుయ్యబట్టారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించి బిల్లును తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి:ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో నూతన విధానం