ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో రెవెన్యూ అధికారుల తీరుపై వెంకట కోటేశ్వరరావు అనే రైతు సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. తన భూమిని రెవెన్యూ అధికారులు రికార్డుల నుంచి తొలగించారని ఆరోపించారు. కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పరిష్కరించడం లేదని వాపోయారు. తన సమస్య పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ జమలాపురంలోని సెల్‌టవర్‌ను ఎక్కి ఆందోళన చేపట్టారు.
రెవెన్యూ అధికారుల తీరుని నిరసిస్తూ సెల్‌టవర్ ఎక్కిన రైతు - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
రెవెన్యూ అధికారుల తీరుని నిరసిస్తూ వెంకట కోటేశ్వరరావు అనే రైతు సెల్‌టవర్ ఎక్కారు. తన భూమిని అధికారులు రికార్డుల నుంచి తొలగించారని ఆరోపించారు. ఎన్నిసార్లు తిరిగినా పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్న పోలీసుల హామీతో కిందికి దిగివచ్చాడు.
రెవెన్యూ అధికారుల తీరుని నిరసిస్తూ సెల్‌టవర్ ఎక్కిన రైతు
వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ పై ఉన్న కోటేశ్వరరావుకు ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెస్క్యూ టీం సాయంతో కిందికి తీసుకొచ్చారు.