ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టును వేగంగా నిర్మించి పాలేరు నియోజకవర్గ ప్రజలకు తాగు, సాగునీరందిస్తామని తెలిపారు.
'జిల్లా రాజకీయ పరిణామాలను కేసీఆరే చక్కదిద్దాలి' - మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సరిదిద్దాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
!['జిల్లా రాజకీయ పరిణామాలను కేసీఆరే చక్కదిద్దాలి' farmer minister tummala nageswara rao about khammam district politics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6068869-thumbnail-3x2-a.jpg)
'జిల్లా రాజకీయ పరిణామాలను కేసీఆరే చక్కదిద్దాలి'
'జిల్లా రాజకీయ పరిణామాలను కేసీఆరే చక్కదిద్దాలి'
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్లో తెరాస కార్యకర్తలతో తుమ్మల సమావేశమయ్యారు. జిల్లా రాజకీయాల్లో వచ్చిన పరిణామాలను సీఎం కేసీఆరే చక్కదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలంతా సహకార ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.
- ఇదీ చూడండి :కేంద్రంపై పోరుకు కాంగ్రెస్ సమాయత్తం!