భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఖమ్మం జిల్లా ఏన్కూరులో రైతు సంఘాలు ఆందోళ చేపట్టాయి. వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.
అన్నదాతలకు పరిహారం అందించాలి: రైతు సంఘాలు - ఖమ్మం జిల్లా ఏన్కూరులో రైతు సంఘాల ధర్నా
ఖమ్మం జిల్లా ఏన్కూరు వ్యవసాయ మార్కెట్‌ను రైతు సంఘం నాయకులు సందర్శించారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
![అన్నదాతలకు పరిహారం అందించాలి: రైతు సంఘాలు farmer-associations-protest-at-yenkuru-in-khammam-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9243921-586-9243921-1603184862248.jpg)
అన్నదాతలకు పరిహారం అందించాలి: రైతు సంఘాలు
పత్తి ధర క్వింటా రూ. 3000కి కొనుగోలు చేస్తుండటంతో ఆ విషయాన్ని అన్ని మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా సీసీఐ కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
TAGGED:
ఏన్కూరులో రైతుల ఆందోళన