ఖమ్మంలో ఎక్సైజ్ శాఖ అధికారులు బారుల్లో తనిఖీలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బార్లో నిల్వ ఉంచిన సీసాల కాల పరిమితిని చూశారు. కాలం మించి పోయిన బీర్లను బయట పారబోశారు. మంచిగా ఉన్న వాటిని వైన్స్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. నగరంలోని అన్ని షాపుల్లో ఈ తరహా తనిఖీలు ఉంటాయని పోలీసులు తెలిపారు. కాల పరిమితి లేని వాటిని విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
బీర్లను నేలపాలు చేసిన ఎక్సైజ్ పోలీసులు - మద్యం నేల పాలు
దేశ ఆర్థిక వ్యవస్థను నిలిబెడుతున్నామని మందు బాబులు గర్విస్తున్నారు. ఎండలో, క్యూలో నిల్చొని, మాస్కులు పెట్టుకుని, సామాజిక దూరం పాటిస్తూ మద్యం కొనుగోలు చేస్తుంటే... అక్కడి ఎక్సైజ్ పోలీసులు మాత్రం వాటిని నేలపాలు చేస్తున్నారు... ఎందుకిలా చేస్తున్నారంటే ఇది చదవాల్సిందే.
బీర్లను నేలపాలు చేసిన ఎక్సైజ్ పోలీసులు