తెలంగాణ

telangana

ETV Bharat / state

'అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు'

అక్రమ సంపాదన కోసం అడ్డదారుల్లో మద్యం తీసుకొచ్చి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఆబ్కారీ అధికారి సోమిరెడ్డి హెచ్చరించారు. ఎర్రుపాలెం మండలంలో మద్యం తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకొన్నామని ఆయన వివరించారు.

By

Published : Apr 13, 2020, 2:14 PM IST

excise deportment strictly punishable if smuggled alcohol
'అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు'

లాక్​డౌన్​ సమయంలో అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఆబ్కారీ అధికారి సోమిరెడ్డి హెచ్చరించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. వారి నుంచి 720 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

అక్రమంగా మద్యం రవాణాకు పాల్పడుతున్నా... విక్రయాలు చేస్తున్నారని తెలిసినా ప్రజలు బాధ్యతగా 94409 02277, 94409 02669 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. మద్యం అక్రమ రవాణా అరికట్టడానికి శాఖా పరంగా విస్తృత తనిఖీలు కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి :రూ. 1500కే కరోనా పరీక్ష.. రెండున్నర గంటల్లో ఫలితం

ABOUT THE AUTHOR

...view details