ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఏన్కూర్‌లోని ఓ పేద కుటుంబానికి ఆర్ఎంపీ వెద్యుడు అందించిన రూ.15 వేల ఆర్థిక సాయాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ సహకారంతో ఏన్కూర్‌లో ఏర్పాటు చేసిన ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
పేద కుటుంబానికి ఆర్థికసాయం అందజేసిన ఆర్ఎంపీ వైద్యుడు - rmp help
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటించారు. ఏన్కూర్‌లో ఏర్పాటు చేసిన ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఓ పేద కుటుంబానికి ఆర్ఎంపీ అందించిన సాయాన్ని మాజీ ఎంపీ చేతుల మీదుగా అందించారు.
వైద్యుని కుటుంబానికి ఆర్థికసాయం అందజేసిన పొంగులేటి
గార్లఒడ్డులో సొసైటీ అధ్యక్షుడు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు నివాసంలో తెరాస కార్యకర్తలతో సమావేశమై సమస్యలపై ఆరా తీశారు. జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ లాలు నాయక్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:పోస్టల్ లెక్కింపు ముగిసింది.. సాధారణ కౌంటింగ్ మొదలైంది..
Last Updated : Dec 4, 2020, 3:46 PM IST