తెలంగాణ

telangana

ETV Bharat / state

'దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా..?' - తెలంగాణ తాజా వార్తలు

భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డిపై ఆదివారం తెరాస కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా.. ఖమ్మంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉండటం సరైంది కాదని హెచ్చరించారు.

ex mp jithender reddy said We condemn the attack with bricks
'ఇటుకలతో దాడిచేయటాన్ని ఖండిస్తున్నాం'

By

Published : Mar 15, 2021, 4:39 PM IST

భాజపా నాయకులపై తెరాస గుండాలతో దాడులు చేస్తే సహించేది లేదని భాజపా జాతీయ నాయకులు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి హెచ్చరించారు. భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డిపై ఆదివారం తెరాస కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా.. ఖమ్మంలో ర్యాలీ ప్రదర్శన చేశారు. డిపో రోడ్డులో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొని.. రాష్ట్రంలో దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉండటం సరైంది కాదని అన్నారు.

తెరాస కార్యకర్తలు డబ్బులు పంచుతుంటే.. అక్కడికి పోయిన ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఇటుకలతో దాడిచేయటాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భాజపా శ్రేణులు తరలివస్తే తెరాస ఎక్కడ ఉంటుందని ఎద్దేవా చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తే ఠాణాల ముందు ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇదీ చూడండి :మధిరలో పొట్టేళ్ల పందేలు

ABOUT THE AUTHOR

...view details