తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరేళ్లలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు: పొంగులేటి - పొంగులేటి సుధాకర్​ రెడ్డి తాజా వార్తలు

ప్రధాని నరేంద్రమోదీ తన ఆరేళ్ల పాలనలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మాజీ ఎమ్మెల్సీ, భాజపా నేత పొంగులేటి సుధాకర్​ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఖమ్మం పార్టీ కార్యాలయంలో మోదీ పనితీరును ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.

ఆరేళ్లలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు: పొంగులేటి
ఆరేళ్లలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు: పొంగులేటి

By

Published : Jun 11, 2020, 4:42 PM IST

కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనితీరును ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని ఖమ్మంలో ప్రారంభించినట్లు మాజీ ఎమ్మెల్సీ, భాజపా నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. ప్రధాని తన ఆరేళ్ల పాలనలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఖమ్మం పార్టీ కార్యాలయంలో పేర్కొన్నారు.

లాక్‌ డౌన్‌ సమయంలో రూ. 20 లక్షల కోట్లతో ప్యాకేజీ ప్రకటిస్తే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆ ప్యాకేజీ ఉత్తదే అంటూ ఆరోపించటం సమంజసం కాదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఏంచేశారో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!

ABOUT THE AUTHOR

...view details