వరి సాగు తగ్గించి పామాయిలు పంటలతో లాభాలు పొందాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు నియోజకవర్గంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవపురంలో పామాయిలు మొక్కలను నాటారు.
'వరి తగ్గించి పామాయిలు పంటలతో లాభాలు పొందాలి'
ఖమ్మం జిల్లా కేశవపురంలో పామాయిలు మొక్కలను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాటారు. పాలేరు నియోజకవర్గంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. వరి సాగు తగ్గించి ఇతర పంటలతో లాభాలు పొందాలని సూచించారు.
పామాయిలు మొక్కలను మాజీ మంత్రి తుమ్మల
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఠాపురం లిఫ్ట్‌ను ఏర్పాటు చేశానని అన్నారు. భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా నీరందించామని పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలవటం కంటే ప్రజా సేవనే ముఖ్యమని వ్యాఖ్యానించారు.
ప్రజలు పది కాలాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. అందరూ పామాయిలు తోటలు పెంచి వరి పంట తగించాలని సూచిచారు. ఇతర సాగులతో లాభాలు పొందాలన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సాదు రమేష్ రెడ్డి, మండలాల తెరాస నేతలు పాల్గొన్నారు.