తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా తుమ్మల పుట్టిన రోజు వేడుకలు - ఖమ్మం జిల్లాలో తుమ్మల పుట్టినరోజు వేడుకలు

మాజీ మంత్రి, తెరాస నేత తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను పార్టీశ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత అంటూ జిల్లా వ్యాప్తంగా అభిమానులు, నాయకులు కేక్​కట్​ చేసి.. బాణాసంచా కాల్చుతూ వేడుకులు జరుపుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ex-minister-tummala-nageswara-rao-birthday-celebrations-in-khammam-district
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా తుమ్మల పుట్టిన రోజు వేడుకలు

By

Published : Nov 15, 2020, 5:51 PM IST

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కాకతీయ కమ్మ సంఘం ఆధ్వర్యంలో మధిరలో తుమ్మల పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. సుందరయ్య నగర్​లో ఆయన చిత్ర పటం ఏర్పాటు చేసి కేక్​కట్ చేసి, బాణాసంచా కాల్చుతూ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

అలాగే పాలేరు నియోజక వర్గాల్లో అభిమానులు తెరాస పార్టీ నేతలు తుమ్మల జన్మదిన వేడులకు ఘనంగా చేశారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెంలలోనూ తుమ్మల పుట్టినరోజు వేడుకలను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నెల్లూరు భద్రయ్య, శాఖమూరి రమేష్, నల్లపూసల సీతారాములు, వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరసయ్య నాగేశ్వరరావు, కమ్మ సంఘం బాధ్యులు శ్రీకృష్ణ ప్రసాద్, చెరుకూరి నాగార్జున, మల్లాది వాసు, తదితర నాయకులు, అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తుమ్మల ఇంటికి వెళ్లిన మంత్రులు..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details