ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల టిక్‌టాక్‌పై ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. ఉద్యోగ సమయంలో టిక్‌టాక్ వీడియోల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈటీవీ భారత్ కథనం ఆధారంగా ఔట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న అనిత, జ్యోతి, రవిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: టిక్‌టాక్ చేస్తున్న ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు - etv bharat
ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. పనిని పక్కన పెట్టి టిక్‌టాక్ చేస్తోన్న ఖమ్మం కార్పొరేషన్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులిచ్చారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్
వీళ్లంతా బర్త్, డెత్ సర్టిఫికెట్లు, ట్రేడ్ లైసెన్సులు ఇచ్చే కీలక విభాగాల్లో పనిచేస్తున్నారు. పనిని పక్కన పెట్టి టిక్‌టాక్ చేయడంతో అధికారులు వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ వీడియోల్లో కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్, డీబీ సెక్షన్ అసిస్టెంట్ వీరన్న కూడా కనిపించడంతో అతన్ని కూడా సంజాయిషీ కోరారు.
ఇదీ చూడండి:పనివేళల్లో టిక్‌టాక్..మున్సిపల్ ఉద్యోగుల టైంపాస్