తెలంగాణ

telangana

ETV Bharat / state

భౌతిక దూరం పాటిస్తూ రక్తదానం చేసిన యువకులు - blood donation at nelokondapalli

లాక్​​డౌన్​ కారణంగా తలసేమియా వ్యాధి గ్రస్తులు రక్తం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నేలకొండపల్లి డెవలప్​మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ పలువురు యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Establish a blood donation camp in keeping with physical distance at khammam
భౌతిక దూరం పాటిస్తూ రక్తదానం చేసిన యువకులు

By

Published : Apr 16, 2020, 12:31 PM IST

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నేలకొండపల్లి డెవలప్​మెంట్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధి గ్రస్తులు ఇబ్బందులు పడకుండా ఉండాలని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

స్థానిక తహసీల్దార్ వీరభద్రం, సర్పంచ్​ నవీన్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. రక్త నమూనాలు ఇవ్వటానికి 60 మంది యువకులు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ పలువురు యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :అక్కడ గాంధీ విగ్రహానికి మాస్క్ కట్టారు

ABOUT THE AUTHOR

...view details