ఖమ్మం జిల్లా ఏన్కూరు జెడ్పీటీసీ బాదావత్ బుజ్జి తన భర్తపై జరిగిన దాడిని ఖండిస్తూ.. తెరాస నాయకులతో కలిసి ఆమె ఏన్కూరులో నిరసన తెలిపారు. భద్రుతండా పంచాయితీలో తన భర్తపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా దారి కాసి దాడి చేశారని, విచక్షణారహితంగా కొట్టి అపస్మారక స్థితిలో పడేసి వెళ్లిపోయారని జెడ్పీటీసీ బాదావత్ బుజ్జి ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజన జెడ్పీటీసీ భర్తపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు - ఖమ్మం
తన భర్తపై ఉద్ధేశ్యపూర్వకంగా దారి కాసి.. దాడి చేశారని, నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని ఖమ్మం జిల్లా ఏన్కూరు జెడ్పీటీసీ బాదావత్ బుజ్జి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.
గిరిజన జెడ్పీటీసీ భర్తపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు
ఒక ప్రజా ప్రతినిధి భర్తపైనే ఇలా దాడులు చేస్తే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రి, ఎంపీ, వైరా ఎమ్మెల్యే, పోలీసు ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి కన్నీటి పర్యంతమయ్యారు.
ఇవీ చూడండి:శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు