Engineering students fight: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్న ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు.. రెండు గ్రూపులుగా విడిపోయి మూకుమ్మడిగా దాడి చేసుకున్నారు. విద్యార్థులంతా రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, బీరు సీసాలు, రాళ్లతో కొట్టుకున్నారు.
మద్యం మత్తులో విద్యార్థుల మధ్య గొడవ చెలరేగి కొట్టుకున్నారని తెలుస్తోంది. ఘటనకు కారణమైన ఓ స్టూడెంట్ను సస్పెండ్ చేశారని తెలిసింది. బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు గొడవలకు దిగడం చర్చనీయాంశంగా మారింది.