తెలంగాణ

telangana

ETV Bharat / state

విధినిర్వహణకు వచ్చి గుండెపోటుతో మృతి

ఎన్నికల విధుల నిర్వహణకు హాజరైన  ఓ ఉద్యోగి పోలింగ్​ సామగ్రి తీసుకుంటుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

విధినిర్వహణకు వచ్చి విగత జీవగా మారాడు

By

Published : Apr 11, 2019, 12:04 AM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం జరిగింది. ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. మధిర నీటిపారుదల శాఖ జూనియర్​ అసిస్టెంట్​ వై. నాగరాజు సత్తుపల్లిలోని జ్యోతి నిలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్​ సామగ్రి కేంద్రానికి వచ్చాడు. అందరిలాగే తనకు కేటాయించిన కేంద్రం తాలూకు సామగ్రి తీసుకుంటుడగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన అతన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

సత్తుపల్లి నియోజకవర్గంలో 280 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్​ జరగనుంది. మొత్తం 1250 మంది సిబ్బంది విధులకు హాజరయ్యారు. పోలింగ్​ సామగ్రి తీసుకుని వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు.

విధినిర్వహణకు వచ్చి విగత జీవగా మారాడు

ఇదీ చదవండి: నిబంధనలు అతిక్రమించిన ఉపాధ్యాయురాలి​ సస్పెండ్​

ABOUT THE AUTHOR

...view details