ఖమ్మం జిల్లా వైరాలో ముగ్గురు విద్యుత్ శాఖ ఇంజినీరింగ్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పనుల్లో తక్కువ పనికి ఎక్కువ బిల్లలు చెల్లించారనే ఆరోపణలపై వీరిపై చర్యలు తీసుకున్నారు. తల్లాడ ఏడీఏ హరీశ్, వైరాలో ఏఈగా పనిచేస్తున్న కుమార్, గతంలో ఇక్కడ పనిచేసి బచ్చోడకు బదిలీ అయిన జగదీశ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.
వైరాలో ఇంజినీరింగ్ అధికారుల సస్పెండ్ - electricity department engineers suspend in khammam
విద్యుత్ శాఖ అభివృద్ధి పనుల్లో తక్కువ పనికి ఎక్కువ బిల్లలు చెల్లించారనే ఆరోపణలపై ఖమ్మం జిల్లా వైరాలో ముగ్గురు ఇంజినీరింగ్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు అధికారులు ఒకే డివిజన్ వారు కావడం విశేషం.

వైరాలో సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ పథకంలో భాగంగా విద్యుత్ పరమైన పనులకు చేసిన బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు తేలింది. ఆర్సీఎం చర్చి రోడ్డులో చేపట్టిన పనుల్లో ఐదు వైర్ల తీగల ఏర్పాటు పనులు ఐదు నెలల క్రితం నిర్వహించారు. రెండు చోట్ల మొత్తం ఏడు కిలోమీటర్ల వరకు కండక్టర్ తీగలు బిగించినందుకు బిల్లులు చెల్లించారు. కిలోమీటర్‌కు రూ.20 వేల చొప్పున గుత్తేదారుకు చెల్లించారు. ఆ పనులపై ఉన్నతాధికారులు తనిఖీలు చేయగా ఐదు కిలోమీటర్ల పనికి ఏడు కిలోమీటర్ల బిల్లులు చేసినట్లు తేలింది. దీనిపై ఉన్నతాధికారులు ఏడీఏ, ఇద్దరు ఏఈలపై చర్యలకు ఉపక్రమించారు.
ఇదీ చదవండి:ప్రభుత్వ పనులని చెప్తూ... యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా