తెలంగాణ

telangana

ETV Bharat / state

'భవిష్యత్తులో సత్తుపల్లి జిల్లా సాధనకు కృషి చేస్తా' - మున్సిపోల్స్​ ప్రచారం తాజా వార్త

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేసిన తెరాస ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను చూసి పుర ఎన్నికల్లో అన్ని వార్డుల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.  పలు కుల సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ నామా నాగేశ్వర​రావు, ఎమ్మెల్యే సండ్ర హాజరయ్యారు.

election campaign in khammam
'భవిష్యత్తులో సత్తుపల్లి జిల్లా సాధనకు కృషి చేస్తా'

By

Published : Jan 19, 2020, 10:54 AM IST

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను చూసి మున్సిపాలిటీ ఎన్నికల్లో 23 వార్డులకు గాను 23 వార్డులు గెలిపించాలని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పలు కుల సంఘాలతో నామ, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమావేశమయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలను చూసి దేశంలోని మిగతా రాష్ట్రాల వారు ప్రవేశ పెడుతున్నారని తెలిపారు. ఇతర పార్టీల వారు వచ్చి చెప్పే మోసపు మాటలు నమ్మవద్దన్నారు. సత్తుపల్లిని అభివృద్ధి పదంలో నడిపేది ఒక తెరాస పార్టీ అని గమనించి ఓటు వేయాలని నామ తెలిపారు.

ప్రజల మధ్య ఉంటూ మీరు చెప్పిన పని ఏది విస్మరించకుండా చేస్తున్నామని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో ఛైర్మన్ అవడానికి అభ్యర్థులను పోటీ పెట్టలేని పార్టీలు వచ్చి మీకు చెప్పే మాటలు వాస్తవాలు కావని ఆయన అన్నారు. భవిష్యత్తులో కొత్త జిల్లాల ప్రతిపాదన ప్రభుత్వం చేస్తే మీ ప్రతినిధిగా సత్తుపల్లి జిల్లా సాధనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సండ్ర హామీ ఇచ్చారు.

'భవిష్యత్తులో సత్తుపల్లి జిల్లా సాధనకు కృషి చేస్తా'

ఇవీ చూడండి: క్రియాశీల నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్‌కు తొలిస్థానం

ABOUT THE AUTHOR

...view details