తెలంగాణ

telangana

ETV Bharat / state

'8 వేల కేసులు పరిష్కరించి రూ. 55 కోట్ల పరిహారం ఇప్పించాం' - జిల్లా కలెక్టర్లు తాజా వార్తలు

రెండేళ్ల 10 నెలల కాలంలో సుమారు 8 వేల కేసులు పరిష్కారించామని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. దాదాపుగా 55 కోట్ల 60 లక్షల పరిహారం ఇప్పించామని స్పష్టం చేశారు.

'8 వేల కేసులు పరిష్కరించి రూ. 55 కోట్ల పరిహారం ఇప్పించాం'
'8 వేల కేసులు పరిష్కరించి రూ. 55 కోట్ల పరిహారం ఇప్పించాం'

By

Published : Nov 20, 2020, 3:20 AM IST

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోపాలపురంలో జన్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఎస్సీల గోడు వినే వారే కరువయ్యారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి ప్రత్యేక జీవోతో కమిషన్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.

అప్పడు 10 వేల కేసులు..

కమిషన్ ఏర్పాటుకు ముందు పది వేల ఎస్సీ ఎస్టీకి సంబంధించి కేసులు పెండింగ్​లో ఉన్నాయని ఎర్రోళ్ల గుర్తు చేశారు. కమిషన్ ఏర్పడ్డాక రెండు సంవత్సరాల పది నెలల కాలంలోనే సుమారు 8 వేలకు పైగా కేసులను పరిష్కరించామన్నారు.

కలెక్టర్లతో మాట్లాడి..

సుమారు రూ. 55 కోట్ల 60 లక్షల పరిహారాన్ని ప్రభుత్వంతో మాట్లాడి జిల్లా కలెక్టర్ల కృషితో ఇప్పించామని స్పష్టం చేశారు. కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత తాము హైదరాబాద్​కే పరిమితం కాకుండా గ్రామాలు, తండాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు.

గిరిజనుల స్వాగతం..

సంప్రదాయ రీతిలో కమిషన్ సభ్యులకు స్వాగతం పలికిన కామేపల్లి మండల గిరిజన మహిళలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ పర్యటనలో తీసుకువచ్చిన సమస్యలను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్ల సహకారంతో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

'8 వేల కేసులు పరిష్కరించి రూ. 55 కోట్ల పరిహారం ఇప్పించాం'

ఇవీ చూడండి : గ్రేటర్​ పోరు.. రెండో రోజు భారీగా నామినేషన్లు

ABOUT THE AUTHOR

...view details