తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో రెండో రోజు ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్​ పరీక్ష - ఖమ్మం జిల్లాలో ముగిసిన ఎంసెట్​ పరీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్​ పరీక్ష రెండోరోజు ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 6 పరీక్ష కేంద్రాల వద్ద 6,953 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.

eamcet-exam-completed-in-khammam-district
ఖమ్మం జిల్లాలో రెండో రోజు ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్​ పరీక్ష

By

Published : Sep 10, 2020, 12:10 PM IST

తెలంగాణలో ఎంసెట్ పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. ఒక నిమిషం నిబంధన ఉండటం వల్ల విద్యార్థులు ఉదయం 7:30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాల్లో 6,953 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.

కొవిడ్ నిబంధనలనుసరించి ప్రతి విద్యార్థికి అధికారులు థర్మల్​ స్కానర్​ సహాయంతో ఉష్ణోగ్రతలు నమోదు చేశారు. 99 డిగ్రీల పైన ఉష్ణోగ్రత ఉంటే వారికి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసి పరీక్ష రాయించారు.

ఇదీ చూడండి.అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారి నియామకం

ABOUT THE AUTHOR

...view details