తెలంగాణ

telangana

ETV Bharat / state

Dussehra closing ceremonies: కోలాహలంగా దసరా ముగింపు ఉత్సవాలు - తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ముగింపు

రాష్ట్రవ్యాప్తంగా దసరా ముగింపు ఉత్సవాలు కోలాహలంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు.... చివరిరోజు ఘనంగా వీడ్కోలు పలికారు (Dussehra closing ceremonies). డీజే పాటలు, నృత్యాలతో వీధుల్లో అమ్మవారిని ఊరేగిస్తూ సందడి చేశారు.

Dussehra
Dussehra

By

Published : Oct 17, 2021, 5:12 AM IST

Updated : Oct 17, 2021, 6:42 AM IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి (Dussehra closing ceremonies). చివరిరోజున రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భక్తులు... దుర్గాదేవి అమ్మవారిని ఘనంగా ఊరేగించారు. హైదరాబాద్‌ జియాగూడలో నిర్వహించిన అమ్మవారి నిమజ్జన కార్యక్రమం సందడిగా సాగింది. సుమారు 150 మంది భక్తులు బతుకమ్మ ఆడుతూ ఊరేగింపు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ కాంతులు, మహిళలు కోలాటాలు, యువత నృత్యాలతో అమ్మవారికి వీడ్కోలు పలికారు.

కోలాహలంగా దసరా ముగింపు ఉత్సవాలు

వెయ్యిమందితో కోలాటం

ఖమ్మం జిల్లా వైరా, తల్లాడ మండల కేంద్రాల్లో దుర్గాదేవి ఊరేగింపు, బతుకమ్మ సంబురాలు సందడిగా సాగాయి (Dussehra closing ceremonies). వైరాలో మహాలక్ష్మి ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పది అడుగుల బతుకమ్మతో ఊరేగింపు చేశారు. వెయ్యి మంది మహిళలు కోలాటం ఆడుతూ సందడి చేశారు.

11రోజు సద్దుల బతుకమ్మ

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో 11వ రోజు సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తీరొక్క పూలతో తయారుచేసిన బతుకమ్మలతో ఆడపడుచులు ఆడిపాడారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో శనివారం సద్దుల బతుకమ్మ జరుపుకున్నారు. మహిళలు బతుకమ్మలు ఆడుతూ సందడి చేశారు.

భద్రకాళీ భద్రేశ్వర కల్యాణం

భద్రకాళీ భద్రేశ్వర కల్యాణ వేడుక

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరాయి. చివరి రోజు భద్రకాళీ భద్రేశ్వర కల్యాణం జరిపారు.ఏటా దసరా మరుసటి రోజున కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భద్రకాళీ భద్రేశ్వర కల్యాణ వేడుకలో ఓరుగల్లు వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. (Dussehra closing ceremonies).

ఇదీ చూడండి:Conflict: అధికారపార్టీలో అంతర్గత వార్.. దసరా వేడుకల్లో తెరాస వర్గీయుల ఫైట్

Last Updated : Oct 17, 2021, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details