కొవిడ్ పాజిటివ్ ఉన్నవారికి ఇచ్చే మందుల్లో పై రెండు రకాలు అత్యంత ముఖ్యమైనవి. వాటికి బదులుగా కాల్షియం మాత్రలు, యాంటీబయోటిక్ ఇతర మాత్రలు ఇస్తున్నారు. కొవిడ్ బాధితులే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి సాధారణ చికిత్సల కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ సమయంలో ముఖ్యమైన మందుల కొరత ఆందోళన కల్గించేదిగా మారింది. జూన్, జులై మాసాల్లో వంద దాటని ఓపీ ఇప్పుడు నాలుగు వందలు దాటుతోంది. ఇక కొవిడ్ లక్షణాలతో వచ్చే వారి సంఖ్య షరా మామూలే. ప్రతి రోజు 150 మందికి పైగా ఆస్పత్రికి వస్తున్నారు. ఇప్పటికే హోం ఐసోలేషన్ ఉన్న వారి సంఖ్య మూడు వేల వరకు ఉంటుంది. ఈ క్రమంలో ఔషధాల కొరత ఏర్పడటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు కూడా కరోనా బాధితులకు కిట్‌లో అందుబాటులో ఉన్న మాత్రలను మాత్రమే అందిస్తూ లేని వాటి కోసం బయటకు రాస్తున్నారు.
కొవిడ్ బాధితులకు అజిత్రోమైసిన్ తప్పనిసరిగా ఇవ్వాలని లేదని, విటమిన్-సి కూడా అవసరాన్ని బట్టి ఇస్తారని ఆర్‌ఎంవో డాక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. ఆజిత్రోమైసిన్‌కు ప్రత్యామ్నాయంగా మాత్రలు, విటమిన్-సి కోసం నిమ్మ, ఉసిరి, దానిమ్మ వాడినా సరిపోతుందని తెలిపారు.