కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఖమ్మంలో పోలీసులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు బయటకు రావద్దంటూ ప్రధాన రోడ్డుపై కొవిడ్-19 వైరస్ ఆకారంలో బొమ్మ గీసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అడుగు బయట పెట్టకు.. ఆపదలో పడకురా అంటూ నినాదం రాసి తమ వంతు కృషి చేస్తున్నారు.
'అడుగు బయట పెట్టకు.. ఆపదలో పడకు' - పోలీసుల వినూత్న ప్రచారం
కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం పోలీసులు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చేతులు కలపొద్దంటూ డాన్స్ చేశారు. ఇటీవల కరోనా హెల్మెట్లు ధరించి ప్రజలకు అవగాహన కల్పించారు. తాజాగా ఖమ్మం జిల్లాలో రోడ్డుపై కొవిడ్-19 బొమ్మ గీసి 'అడుగు బయట పెట్టకు.. ఆపదలో పడకు' అంటూ నినాదం రాసి తమ వంతు ప్రచారం చేస్తున్నారు.
'అడుగు బయట పెట్టకు.. ఆపదలో పడకు'