తెలంగాణ

telangana

ETV Bharat / state

దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, కుట్టుమిషన్ల పంపిణీ - ట్రై సైకిళ్లు, కుట్టుమిషన్ల పంపిణీ వార్తలు

దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు ఖమ్మంలోని సామినేని వ్యాజ్జయ్య మెమోరియల్​ సంస్థ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

khammam, handicapped, try cycles and stitching machines
ఖమ్మం, దివ్వాంగులు, ట్రై సైకిళ్లు, కుట్టుమిషన్ల పంపిణీ

By

Published : Jan 10, 2021, 12:16 PM IST

సామినేని వ్యాజ్జయ్య మెమోరియల్‌ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రూ. 3లక్షల విలువ చేసే.. బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్లు, కుట్టుమిషన్లు అందజేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని లింబ్‌ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వికలాంగులకు పంపిణీ చేశారు.

ట్రై సైకిళ్లను అందజేసిన దాతలను మంత్రి అభినందించారు. ప్రతి ఏడాది తమ సంస్థ ద్వారా పేదలకు సహాయం చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.

ఇదీ చదవండి:తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన: తరుణ్ చుగ్

ABOUT THE AUTHOR

...view details