రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆడపిల్లల వివాహం కోసం ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ ద్వారా ఆదుకుంటుందని అన్నారు. అన్ని రంగాల ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తూ దేశంలోనే గుర్తింపు సాధిస్తోందన్నారు.
వైరాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ - షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని లబ్ధిదారులకు వైరా ఎమ్మెల్యే షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమమే ధ్యేయంగా ప్రత్యేక నిధులను కేటాయించిందని తెలిపారు.

వైరాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కల పంపిణీ
వైరాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కల పంపిణీ
ఇదీ చూడండి: సమర్థ భారతదేశం అందరి బాధ్యత: పురుషోత్తం రూపాల