తెలంగాణ

telangana

ETV Bharat / state

సత్తుపల్లిలో 500 కుటుంబాలకు సరుకుల పంపిణీ - 250 కుటుంబాలకు కూరగాయలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పేదలకు సాయం అందించేందుకు మానవతావాదులు ముందుకు వస్తున్నారు. డా.చింతా కిరణ్ కుమార్, మిత్ర బృందం ఆధ్వర్యంలో లక్షల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఆశ కార్యకర్తలకు, పీహెచ్​సీ సిబ్బందికి సరుకులు
ఆశ కార్యకర్తలకు, పీహెచ్​సీ సిబ్బందికి సరుకులు

By

Published : May 5, 2020, 2:10 PM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తోన్న డా.చింతా కిరణ్ కుమార్, మిత్ర బృందం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆశ కార్యకర్తలకు, పీహెచ్​సీ సిబ్బందికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కిరాణా సామగ్రి అందించారు. కల్లూరు మండలం పరిధిలో మందపాటి రాజమోహన్ రెడ్డి, సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో 1.5 లక్షలతో 500 కుటుంబాలకు సరుకులు, మాస్కులు, మజ్జిగ ప్యాకెట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

వేంసూరు మండలంలో...

వేంసూరు మండలం లింగపాలెంలో భవన నిర్మాణ కార్మికులకు సీఐటీయూ నేత మల్లూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కిరాణా సరుకులు పంపిణీ చేశారు. సత్తుపల్లిలో 108,104,102 వాహన సిబ్బందికి ఆశ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు మట్టా దయానంద్ నిత్యావసరాలు అందించారు. భాజపా, జనసేన ఆధ్వర్యంలో 500 మందికి, నవచైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 250 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. వేంసూరు మండలం కందుకూర్​లో అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో 250 కుటుంబాలకు కూరగాయలను సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఇవీ చూడండి : చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం: తలసాని

ABOUT THE AUTHOR

...view details