ఐదు కోట్ల విలువైన చెక్కుల పంపిణీ : మంత్రి అజయ్
ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యటించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. సుమారు ఐదు కోట్ల విలువైన 493 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్క పేదకు అందజేసేందుకు కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు.