తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే రాములు - ఏన్కూరులో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

ఖమ్మం జిల్లా ఏన్కూరులో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని పేర్కొన్నారు.

Distribution of checks to beneficiaries of Kalyana Lakshmi in Encore
ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే రాములు

By

Published : Jun 15, 2020, 5:38 PM IST

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు.

అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్​కే దక్కిందని రాములు నాయక్ అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని ప్రజలకు సూచించారు. ప్రధానంగా రైతులకు, రుణమాఫీ, రైతుబంధు, మార్కెటింగ్ వసతులు కల్పించి వ్యవసాయానికి పెద్దపీట వేశారని కొనియాడారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details