తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం కలెక్టరేట్ ఎదుట వృద్ధ దంపతుల ధర్నా - Khammam collectorate news

పున్నామ నరకం నుంచి తప్పించాల్సిన కుమారుడు.. వృద్ధ దంపతులను ఆస్తి కోసం వేధిస్తున్నాడు. కన్న తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. విసిగిపోయిన వృద్ధులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఖమ్మం కలెక్టరేట్ ఎదుట వృద్ధ దంపతుల ధర్నా
ఖమ్మం కలెక్టరేట్ ఎదుట వృద్ధ దంపతుల ధర్నా

By

Published : Aug 9, 2020, 4:10 PM IST

తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ వృద్ధ జంట ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఫ్లెక్సీతో ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వీడియోస్ కాలనీలో అంబడిపూడి రామకోటయ్య, పుష్పవతి వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కొడుకు, కుమార్తె ఉన్నారు. తమ నివాసంలోనే కొంత భాగాన్ని కుమార్తె పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇటీవల కుమార్తె మరణించింది. నివాస స్థలం మొత్తం తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని కొడుకు ప్రసాద్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని వృద్ధులు వాపోయారు.

కొంత మంది తెరాస నాయకులు... కొడుకుకు మద్దతు తెలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని పైగా రెండో పట్టణ సీఐ తమపై దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తమకు సహాయంగా వచ్చిన స్థానిక యువకుడిని తమ ముందే సీఐ కొట్టాడని వృద్ధులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మంత్రి అజయ్ కుమార్ ను వేడుకుంటున్నారు. ఇవాళ కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ కలిసి వినతిపత్రం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details