తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడిన కోటిలింగాల దివ్య క్షేత్రము

ఖమ్మం జిల్లాలోని కోటిలింగాల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. 108 శివ లింగాలతో రూపుదిద్దిన భారి శివలింగాన్ని దర్శించకుని భక్తులు శివనామస్మరణ చేశారు.

Crowds of devotees at Khammam Kotalinga Temple
భక్తులతో కిటకిటలాడిన కోటిలింగాల దివ్య క్షేత్రము

By

Published : Feb 22, 2020, 11:17 AM IST

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని సుప్రసిద్ధ కోటిలింగాల దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఇల్లందు, బయ్యారం, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో జాతరకు తరలివచ్చారు.

108 శివలింగాలతో రూపుదిద్దిన భారీ శివలింగాన్ని దర్శించుకుని భక్తులకు భక్తి పారవశ్యంలో తరించారు. దేవాలయం క్రింది భాగం నుంచి సంవత్సరం పొడవున జలధార ప్రవహించడం ఈ దేవస్థానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వస్తోంది.

భక్తులతో కిటకిటలాడిన కోటిలింగాల దివ్య క్షేత్రము

ఇదీ చూడండి: శివరాత్రినాడు ఈ ఆలయంలో వింత ఆచారం

ABOUT THE AUTHOR

...view details