Devotees Crowd at Badradri: భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో.. ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో.. స్వామివారి దర్శనం కోసం క్యూలో జనాలు బారులు తీరారు. ఆదివారం కావడంతో ప్రధాన ఆలయంలోని సీతారాములకు.. పంచామృతాలతో అర్చకులు విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. భక్తుల రద్దీతో ఆలయంతో పాటు బయటి ప్రదేశాలూ కళకళలాడుతున్నాయి.
భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ.. యాదాద్రిలోనూ..
devotees Crowd in Bhadradri: భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి కదిలి వచ్చిన భక్తులతో.. ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. స్వామివారి దర్శనం కోసం క్యూలో బారులు తీరారు.
భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తలు రద్దీ
మరోవైపు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ ఉదయం నుంచే భక్తులు బారులుతీరారు. ఫలితంగా ఉచిత దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అనుబంధంగా కొనసాగుతున్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ పూజలు నిర్వహించారు.
ఇవీ చదవండి: