తెలంగాణ

telangana

ETV Bharat / state

"అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నా" - తెదేపా

అనుచరులు, కార్యకర్తలతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు.

అభివృద్ధి కోసమే

By

Published : Mar 18, 2019, 8:32 PM IST

అభివృద్ధి కోసమే
ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సత్తుపల్లి తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వెల్లడించారు. జిల్లాలో తెరాసను బలపరచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పట్టణంలోని ఓ ఫంక్షన్​హాల్లో అనుచరులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలకు చెందిన పలువులు తెదేపా నేతలు హాజరయ్యారు. అధికార పార్టీలో ఎందుకు చేరాల్సి వస్తుందో అనుచరులకు సండ్ర తెలియజేశారు.

తెరాస విజయానికి పనిచేయండి

లోక్​సభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి విజయానికి అందరూ పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశానికి హాజరైన ముఖ్యనాయకులు, కార్యకర్తలు సండ్రతోనే ఉంటామని తెలిపారు.

ఇవీ చూడండి:ఒకరిది ఆరాటం.. మరొకరిది పోరాటం..

ABOUT THE AUTHOR

...view details