తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్కారు బడి... చదువుల గుడి

విద్య ఉద్యోగం కోసమేనంటూ ర్యాంకుల వెంబడి పడుతూ కాసులు కుమ్మరిస్తూ... కార్పొరేట్​ ఉచ్చులో చిత్తవుతున్న తల్లిదండ్రులకు ఈ విద్యాలయం ఓ దేవాలయం. అంకితభావానికి చిత్తశుద్ధి తోడైతే స్థిరమైన ఫలితం సాధించవచ్చనడానికి ఈ పాఠశాలే  ఓ ఉదాహరణ. కార్పొరేట్​ పాఠశాలలకు దీటుగా ర్యాంకులు సాధిస్తూ విద్యా రంగంలో తనదైన ముద్రవేస్తోంది ఖమ్మంజిల్లా మధిరలోని దెందుకూరు జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల.

సర్కారు బడి... చదువుల గుడి

By

Published : Jun 29, 2019, 12:23 AM IST

విద్యార్థులకు పాఠాలు నేర్పడమే కాదు... సర్కారు బడులంటే చిన్నచూపు చూసే వారికి ఈ పాఠశాల సరైన గుణపాఠం చెబుతోంది. కార్పొరేట్​ విద్యాసంస్థలకు దీటుగా బోధిస్తూ... విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించడంలో ఈ పాఠశాలది అగ్రస్థానం. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని దెందుకూరు జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల సాధారణ విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్ది సర్కారు బడులకే తలమానికంగా మారింది.

సర్కారు బడి... చదువుల గుడి

ఘనమైన చరిత్ర

దెందుకూరు జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల ఏడు దశాబ్దాల కిందట ఏర్పాటైంది. ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక్కడ చదివిన విద్యార్థుల్లో ఎంతోమంది దేశవిదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో ఇక్కడి ఉపాధ్యాయులు సిద్ధహస్తులు.

గడచిన మూడేళ్లలో ఈ పాఠశాల నుంచి తొమ్మిది మంది విద్యార్థులు ట్రిపుల్​ ఐటీ సీట్లు సాధించారు. రాష్ట్రంలోనే అత్యధిక ట్రిపుల్​ ఐటీ సీట్లు సాధించిన ప్రభుత్వ పాఠశాలగా అగ్రస్థానంలో నిలిచింది. పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది.

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ అర్థంకాని అంశాలపై పునశ్చరణ ద్వారా వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. తరగతి పుస్తకాలతో పాటు పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ఎల్​ఈడీ టీవీ ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తున్నారు.

పూర్వ విద్యార్థులు, స్థానికులు ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. విరాళాలు ఇచ్చి విద్యార్థుల కోసం మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. లక్షల రూపాయలు కుమ్మరించి విద్యను కొనుక్కునే ఈ రోజుల్లో ఇలాంటి సర్కారు పాఠశాల అందరికి ఆదర్శణీయం.

ఇదీ చూడండి: మొక్కలు సెల్ఫీ తీసుకుంటాయక్కడ..అదెలా?

ABOUT THE AUTHOR

...view details