తెలంగాణ

telangana

ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితుల ఆందోళన

నేలకొండపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితులు ఆందోళన చేపట్టారు. తమ భూముల్లో వైకుంఠధామం నిర్మిస్తున్నారని దాన్ని నిలిపివేయాలని ఎమార్పీఎస్ ఆధ్వర్యంలో దళితులు ఆందోళన నిర్వహించారు. మహిళలు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.

Dalits darna in front of revenue office in khammam district
తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితులు ఆంధోళన

By

Published : Jul 15, 2020, 3:17 PM IST

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి మండలం కోనయ్యగూడెంలో సర్వే నెంబర్ 73, 74, 75 లలో ప్రభుత్వ భూములను దళితులకు 14 కుంటలు చొప్పున గత ప్రభుత్వం పంపిణీ చేసింది. కుటుంబ యజమానులు చనిపోవడం.. వర్షాలు సరిగా పడకపోవడంతో కొన్ని రోజులు ఆ భూమిని సాగు చేయకుండా వదిలేశారు. ప్రస్తుత పాలకవర్గం సభ్యులు ఆ భూమిలోనే వైకుంఠధామం నిర్మించాలని నిర్మాణం పనులు చేపట్టారు.

ఆ పనులు నిలిపివేయాలని దళితుల భూములు దళితులకు ఇవ్వాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమార్పీఎస్ నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్​కు మహిళలు వినతిపత్రం అందించారు. తహసీల్దార్ స్పందించి దళితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండీ:జాతీయ రహదారి సర్వే పనులను అడ్డుకున్న రైతులు.. కారణమిదే..

ABOUT THE AUTHOR

...view details