శాంతిభద్రతల పరిరక్షణతోపాటు అభాగ్యులకు తామున్నాంటూ వైరా సబ్‌డివిజన్ పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా తిండిలేక అలమటిస్తున్న వలసజీవులు, పేదలకు నిత్యావసర సరుకులు అందిస్తూ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. వైరా ఏసీపీ సత్యనారాయణ, సీఐ వసంత్‌కుమార్ నేతృత్వంలో రెండురోజులుగా పోలీస్‌స్టేషన్‌ల వారీగా వందలాది మంది పేదలకు సరుకులు పంపిణీ చేస్తున్నారు.
ఓవైపు శాంతిభద్రతల రక్షణ.. మరోవైపు సేవాగుణం
తమకు కఠినంగా ఉండమమే కాదు.. అవసరమైనప్పుడు సాయం చేయడమూ వచ్చంటున్నారు ఖమ్మం జిల్లా వైరా పోలీసులు. ఓవైపు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూనే.. మరో వైపు ఆపన్నులకు సాయం చేస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.
ఓవైపు శాంతిభద్రతల రక్షణ.. మరోవైపు సేవాగుణం
తల్లాడ పోలీస్‌స్టేషన్ ఎస్సై తిరుపతిరెడ్డి నేతృత్వంలో బియ్యం, నిత్యావసరాలను నిరుపేదలకు అందజేశారు. కొణిజర్ల ఎస్సై మొగిలి ఆధ్వర్యంలో రేషన్‌కార్డు లేని పలువురు పేదలను గుర్తించి వారికి సరుకులను పంపిణీ చేశారు. గ్రామ శివారుల్లో నివసించే వలస కార్మికులు, రహదారుల వెంట ఉంటున్న అభాగ్యులకు ఆహార పొట్లాలను వితరణ చేశారు. పోలీసులు చేపడుతున్న ఈ సేవా కార్యక్రమాల్ని పలువురు అధికారులు ప్రశంసిస్తున్నారు.
ఇవీ చూడండి:'యువతకు కరోనా రాదనుకుంటే పొరపాటే'