తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు నిత్యావసరాల పంపిణీ - ఖమ్మం వైరా లాక్​డౌన్ ​

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు ఆపన్నహస్తం అందించారు. జిల్లాలోని వైరా, ఏన్కూరు మండలాల్లో పేదలకు నిత్యావసరాలు, మాస్కులను పంచిపెట్టారు. పారిశుద్ధ్య కార్మికులకు భోజనం ఏర్పాటు చేశారు.

పేదలకు నిత్యావసరాల పంపిణీ
పేదలకు నిత్యావసరాల పంపిణీ

By

Published : Apr 23, 2020, 4:07 AM IST

  • ఖమ్మం జిల్లా వైరా మండలం కొష్టాలలో 100 పేదలకు జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, తెరాస నాయకుడు కార్తీక్ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంచి పెట్టారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​, టీఎస్​ మార్క్​ఫెడ్​ ఛైర్మన్​ బొర్రా రాజశేఖర్​లు ఈ కార్యక్రమంలో పాల్గొని సరుకులను పంపిణీ చేశారు.
  • వైరా మునిసిపాలిటీలోని ఒకటో వార్డు ఎస్సీకాలనీలో వార్డు డైరెక్టర్‌ మరికంటి డేడికుమారి, నాయకులు మద్దెల రవి ఆధ్వర్యంలో 400 మంది పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని సరుకులు అందించారు.
  • వైరా పురపాలికలో పారిశుద్ధ్య కార్మికులకు కాంగ్రెస్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • ఏన్కూరు మండలం సాయిరాంతండాలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధిహామీ పనులు నిర్వహిస్తున్న కూలీలకు మాస్క్‌లు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details