ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం బాలసముద్రం చెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. బాలసముద్రం పక్కన ఉన్న గువ్వలగూడెం, నేలకొండపల్లి, బుజ్జి గూడెం, పంట పొలాలు నీట మునిగాయి.
భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు.. కుదేలైన అన్నదాతలు - ఖమ్మం జిల్లా
అల్పపీడన ద్రోణి వల్ల కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లా బాలసముద్రం చెరువు పొంగిపొర్లుతోంది. పక్కన ఉన్న పంట పొలాలు నీట మునిగాయి.
భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు.. కుదేలైన అన్నదాతలు
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైనుంచి వచ్చిన వర్షపు నీరు బాలసముద్రం చెరువు అలుగు దారి పక్కనే మునిగిపోయాయి. రైతులు ఎంతో ఆశగా వేసిన వరి పంట వరుణుడి దెబ్బకు నీట మునిగింది. విలువైన పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు పెట్టి నాటిన వరి పొలాలు నీట మునగడం వల్ల ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు
ఇవీ చూడండి : ఎడతెరిపిలేని వర్షాలు... మేడారాన్ని చుట్టేసిన వరద నీరు