ఖమ్మం జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. జిల్లాలోని ఖమ్మం గ్రామీణ మండలం అర్బన్ మండలం రఘునాథపాలెం మండలం చింతకాని, బోనకల్లు, వైరా తదితర మండలాల్లో పత్తి, వరి పంటలు బాగా దెబ్బతిన్నాయి.
భారీ వర్షానికి నీట మునిగిన రైతు కష్టం
ఆరుగాలం శ్రమించిన రైతు కష్టాన్ని ఒక్క రాత్రి కురిసిన భారీ వర్షం నిండా ముంచేసింది. చేతికి వచ్చే పంటను నీటి పాలుచేసేసింది. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పంటలన్నీ నీట మునిగిపోయాయి.
crop damaged due to heavy rain in khammam district
పత్తి చేలల్లో నీరు చేరి పత్తి రాలిపోయింది. వాగులు ఉప్పొంగడం వల్ల చెరువులు అలుగులు పారి వరి పంటలను ముంచేశాయి. కొన్నిచోట్ల వరి పొట్ట దశలో ఉండటం వల్ల పంట చేతికి అందకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.