తెరాస స్వీయ తప్పిదాలే భాజపా బలపడేందుకు దోహదం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకొచ్చిన అన్ని చట్టాలకు గుడ్డిగా మద్దతు తెలిపిన కేసీఆర్... తన అధికారానికి ఎసరు వస్తుందన్న తర్వాతే భాజపాను వ్యతిరేకిస్తున్నారని ఖమ్మంలో విమర్శించారు. భాజపాతో లాలూచీ పడి రాజకీయాలు చేసిన ఏ ప్రాంతీయ పార్టీ మనుగడ సాగించలేదని.. ప్రస్తుతం తెరాస పరిస్థితి కూడా అంతేనన్నారు.
'తెరాస తప్పిదాలే భాజపా బలపడేందుకు దోహదం చేస్తున్నాయి' - ghmc elections 2020
రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదగడం అత్యంత ప్రమాదకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. తెరాస స్వీయ తప్పిదాలే భాజపా బలపడేందుకు దోహదం చేస్తున్నాయని ఆయన అన్నారు.
'తెరాస తప్పిదాలే భాజపా బలపడేందుకు దోహదం చేస్తున్నాయి'
రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదగడం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగంలో చిచ్చుపెట్టిన కేంద్రం తీరును నిరసిస్తూ డిసెంబర్ 8న చేపట్టిన బంద్‌ను విజయవంతం చేసేందుకు భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చూడండి:ఊహించని మలుపులతో... ఆసక్తికరమైన ఫలితాలతో..