కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఖమ్మంలో సీపీఎం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నిబంధనలు పాటిస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు.
కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం: సీపీఎం - సీపీఎం ఆందోళన వార్తలు
వైరస్ను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం కార్యకర్తలు ఆరోపించారు. కేంద్ర విడుదల చేసిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజిని పేదలకు సక్రమంగా చేరేలా చూడాలని ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు.
![కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం: సీపీఎం cpm-party-protest-against-central-and-state-government-in-khammam-collectrate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7636348-thumbnail-3x2-cpm.jpg)
'కరోనాను కట్టడి చేయడంలో విఫలమయ్యారు'
వైరస్ను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు. లాక్డౌన్ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజిని పేదలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి:పేట్లబురుజు ఆస్పత్రిలో 32 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా