విరసం నేత వరవరరావు, ఆచార్య సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... ఖమ్మంలో వక్తలు అభిప్రాయపడ్డారు. సీపీఎం ఆధ్వర్యంలో పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
'వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి'
ఖమ్మం పట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విరసం నేత వరవరరావు, ఆచార్య సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
cpm
భారత రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛను వినియోగించుకున్నందుకు ప్రభుత్వాలు అక్రమంగా కేసులు పెడుతున్నాయని వక్తలు ఆరోపించారు. వరవరరావు, సాయిబాబాలను అన్యాయంగా జైలులో ఉంచారన్నారు. వరవరరావు, సాయిబాబాలు గత 22 నెలలుగా జైళ్లో ఉన్నారని.. వారి ఆరోగ్యం సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరును.. విధానాలను విమర్శిస్తే దేశద్రోహం కేసులు పెట్టి జైలులో పెడతారా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'