దేశ రాజధాని దిల్లీ అన్నదాతల ఆందోళనలతో అట్టుడుకుతోంది. కేంద్రప్రభుత్వంపై కర్షకులు చేస్తున్న పోరాటానికి ఖమ్మం జిల్లా సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. పట్టణంలోని పెవిలియన్ మైదానం నుంచి జడ్పీ కూడలి వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ధర్నా చేశారు.
రైతుల ధర్నాకు మద్దతుగా సీపీఎం ద్విచక్రవాహన ర్యాలీ - ఖమ్మం జిల్లాలో సీపీఎం ర్యాలీ
దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలుపుతూ ఖమ్మం జిల్లాలో సీపీఎం నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పెద్దఎత్తున అన్నదాతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ధర్నాకు మద్దతుగా సీపీఎం ద్విచక్రవాహన ర్యాలీ
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రైతులపై జలఫిరంగులు, భాష్పవాయువులు ప్రయోగించడం అప్రజాస్వామికమని అన్నారు. చట్టాలపై ప్రధాని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులతో వెంటనే చర్చలు జరపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.