తెలంగాణ

telangana

ETV Bharat / state

'మొదట రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయాలి'

రైతుల పట్ల రెవెన్యూశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరును సీపీఐఎంఎల్​ న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖడించింది. చిన్నపాటి లోపాలకు కూడా డబ్బులు ఆశిస్తున్న రెవెన్యూశాఖను మొదట ప్రక్షాళన చేయాలని జిల్లా కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్​ చేశారు.

By

Published : Jun 27, 2019, 10:54 PM IST

cpiml newdemocrasi leader Criticized telangana revenue department

రెవెన్యూశాఖలో చోటు చేసుకున్న అవినీతిని రూపుమాపి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ఖమ్మం జిల్లా మధిరలో డిమాండ్ చేశారు. భూ ప్రక్షాళన జరిగినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా నేటికీ 10 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందకపోవటం సోచనీయమన్నారు. చిన్నపాటి లోపాలను సరిచేసేందుకు రైతుల నుంచి అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. తక్షణమే గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనుల సమస్యలపై వచ్చే నెల 4న హైదరాబాదులో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు రంగారావు తెలిపారు.

'మొదట రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details